పోటాపోటీగా... | Telangana Panchayat Elections Notifications Second Phase | Sakshi
Sakshi News home page

పోటాపోటీగా...

Jan 13 2019 9:56 AM | Updated on Jan 13 2019 9:57 AM

Telangana Panchayat Elections Notifications Second Phase - Sakshi

నామినేషన్‌ దాఖలు చేస్తున్న నాయకులు

కరీంనగర్‌: రెండో విడత ఎన్నికలు నిర్వహించే గ్రామాల్లో శనివారం నామినేషన్ల జోరు కొనసాగింది. పోటాపోటీగా ర్యాలీలు తీసి నామినేషన్‌ కేంద్రాలకు చేరుకుని రిటర్నింగ్‌ అధికారులకు నామినేషన్‌లు అందజేశారు. జిల్లావ్యాప్తంగా సర్పంచ్‌ స్థానాలకు 199 మంది, వార్డుసభ్యుల స్థానాల కోసం 970 మంది నామినేషన్లు దాఖలు చేశారు. రెండోవిడతలో మానకొండూర్, తిమ్మాపూర్, శంకరపట్నం, గన్నేరువరం, చిగురుమామిడి మండలాల్లోని 107 గ్రామపంచాయతీలకు, 1,014 వార్డుసభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.  

మానకొండూర్, తిమ్మాపూర్‌లో భారీగా..
మానకొండూర్‌లో 27 సర్పంచ్‌ స్థానాలుండగా 57 మంది, తిమ్మాపూర్‌లో 23 సర్పంచ్‌ స్థానాలకు 54 మంది నామినేషన్‌లు దాఖలు చేసి ఎన్నికల వేడిని పుట్టించారు. నామినేషన్‌ల దాఖలుతో గ్రామాల్లో ప్రచారం జోరందుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement