
వాటర్‌గ్రిడ్‌పై మంత్రి కేటీఆర్ సమీక్ష
వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు టెండర్ల ప్రక్రియను వేగవంత చేయాలని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు టెండర్ల ప్రక్రియను వేగవంత చేయాలని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. ఎర్రమంజిల్‌లోని ఇంజినీర్ ఇన్ ఛీఫ్ కార్యాలయాలను గురువారం మంత్రి ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 7గంటలవరకు ఆర్‌డబ్ల్యుఎస్ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. వాటర్‌గ్రిడ్ కార్పొరేషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రాజెక్టు సర్వే, ఎక్విప్‌మెంట్, ఉద్యోగ నియామకాలు తదితర కీలక అంశాలపై చర్చలు జరిగాయి. గ్రిడ్ పనులకు ప్రాథమికంగా రూ.2 వేల కోట్లు మంజూరు చేయడంతో పనుల వేగం పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆశాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్, ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజినీర్ ఇన్ ఛీప్ సురేందర్‌రెడ్డి, పలువురు చీఫ్ ఇంజినీర్లు పాల్గొన్నారు. అనుకోకుండా మంత్రి కేటీఆర్ నేరుగా తమ కార్యాలయానికి రావడంతో ఉద్యోగులు ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు.