నేడు బోధనాసుపత్రుల బంద్‌ | Telangana junior doctors decision against NMC | Sakshi
Sakshi News home page

నేడు బోధనాసుపత్రుల బంద్‌

Jul 31 2019 2:29 AM | Updated on Jul 31 2019 10:18 AM

Telangana junior doctors decision against NMC - Sakshi

ఫైల్ ఫోటో

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ మెడికల్‌ బిల్లు (ఎన్‌ఎంసీ)–2019కి వ్యతిరేకంగా తెలంగాణ జూనియర్‌ డాక్టర్లు (జూడా) ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు, వాటి అనుబంధ ఆసుపత్రుల్లో వైద్య సేవలను నిలిపివేయనున్నారు. బుధవారం ఉదయం 6 నుంచి గురువారం ఉదయం 6 వరకు 24 గంటలపాటు బంద్‌ నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో ఆయా బోధనాసుపత్రుల్లో వైద్య సేవలకు ఇబ్బందులు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయా కాలేజీల ప్రిన్సిపాల్స్‌ను వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) డాక్టర్‌ రమేశ్‌రెడ్డి ఆదేశించారు.

ఈ మేరకు అంతర్గత ఉత్తర్వులు జారీచేశారు. జాతీయ మెడికల్‌ బిల్లు వల్ల అనేక అనర్థాలు ఉన్నాయని జూడాలు పేర్కొంటున్న విషయం విదితమే. దీనిపై ఢిల్లీలో దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లోనూ జూడాల ప్రతినిధులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement