TS Inter Results 2020: Download, Telangana Intermediate 1st, 2nd Year, Results are Declared - Salshi
Sakshi News home page

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

Jun 18 2020 3:09 PM | Updated on Jun 18 2020 4:21 PM

Telangana Inter Results Released - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  తెలంగాణ ఇంటర్మీడియెట్‌ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేశారు. గత మార్చి నెలలో జరిగిన ఈ పరీక్షలకు 9.65 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలను  4,80,555 మంది విద్యార్థులు హాజరుకాగా, 67.47 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎప్పటిలాగానే ఫలితాల్లో బాలికలు ముందంజలో ఉన్నారు. బాలికలు 60శాతం, బాలురు 52.30 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌ పరీక్షలను 4,11,631 మంది విద్యార్థులు రాయగా, 68.86శాతం ఉత్తీర్ణత సాధించారు. వారిలో బాలికలు 75.15 శాతం, బాలురు 62.10 శాతం పాసయ్యారు. ఇంటర్‌ ఫలితాల్లో 76 శాతం ఉత్తీర్ణతతో కొమురం భీం ఆసీఫాబాద్‌ జిల్లాకు అగ్రస్థానం దక్కగా.. 75 శాతంతో మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచింది.

ఫలితాల విడుదల సందర్భంగా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ.. అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహించామన్నారు.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాల్యుయేషన్‌కు సహకరించిన లెక్చరర్లకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఐసిఆర్, ఓఎంఆర్ సాంకేతికతను ఉపయోగించుకుని ఫలితాలు నిర్ణయించినట్లు మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. త్వరలోనే అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ప్రకటిస్తామని పేర్కొన్నారు.  ఫలితాలు  www.sakshieducation.com లో చూడవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement