జీవో 421 అమలులో తెలంగాణ ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని ఉభయ రాష్ట్రాల మానవ హక్కుల వేదిక అధ్యక్షుడు జీవన్‌కుమార్ అన్నారు.
జగదేవ్‌పూర్(మెదక్): జీవో 421 అమలులో తెలంగాణ ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని ఉభయ రాష్ట్రాల మానవ హక్కుల వేదిక అధ్యక్షుడు జీవన్‌కుమార్ అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు సాయం అందించేందుకు ఉద్దేశించిన 421 జీవో అమల్లో ప్రభుత్వ తీరు సంతృప్తికరంగా లేదన్నారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం పరిహారం రూ.1.50లక్షల నుంచి 5 లక్షలకు పెంచాలని కోరారు. ఆయా రైతు కుటుంబాలకు ఇళ్ల్లు, పిల్లల చదువు, ఇతర వసతులు ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్ కృష్ణ, కార్యదర్శి అన్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆహ్మద్, తదితరులు ఉన్నారు.