మైనర్ ఇరిగేషన్కే అత్యధిక ప్రాధాన్యం:కేసీఆర్ | Telangana govt most prefered to irrigation department, says CM KCR | Sakshi
Sakshi News home page

మైనర్ ఇరిగేషన్కే అత్యధిక ప్రాధాన్యం:కేసీఆర్

Sep 25 2014 12:44 PM | Updated on Aug 15 2018 9:22 PM

మైనర్ ఇరిగేషన్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

హైదరాబాద్: మైనర్ ఇరిగేషన్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గురువారం హైదరాబాద్లో తెలంగాణ ఇరిగేషన్ ఇంజినీర్స్తో కేసీఆర్ సమావేశమైయారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నీటి పారుదల వ్యవస్థను నాశనం చేశారని ఆయన సీమాంధ్ర పాలకులపై ధ్వజమేత్తారు. 1956లో తెలంగాణలో చెరువులు కుంటల ద్వారా 20 లక్షల ఎకరాలను నీరందేది అని కేసీఆర్ గుర్తు చేశారు.

రాష్ట్రంలో మహబూబ్నగర్లోనే అత్యధిక చెరువులు కుంటలున్నాయని... కానీ అన్ని అవకాశాలున్నా ఆ పట్టణం తీవ్ర వివక్షకు గురైందని ఆరోపించారు. ఇరిగేషన్ శాఖకు పూర్వ వైభవం తీసుకువస్తామని ఈ సందర్బంగా ఆ శాఖ ఉన్నతాధికారులకు కేసీఆర్ భరోసా ఇచ్చారు. వచ్చే నాలుగేళ్లలో ఆ రంగానికి 50 నుంచి 60 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement