వారి కోసం 25 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బార్ కౌన్సిల్ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకి ధన్యవాదాలు తెలిపింది. కరోనా కారణంతో లాక్‌డౌన్ విధించడంతో ఇబ్బంది పడుతున్న అడ్వకేట్లను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ. 25 కోట్లను మంజూరు చేసింది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఇది అడ్వకేట్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని బార్ కౌన్సిల్ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో 40,000వేల మంది అడ్వకేట్‌లు ఉన్నారని వారిలో కొత్తగా ఈ వృత్తిని ఎంచుకున్న వారు లాక్‌డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్నారని బార్ కౌన్సిల్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది.
(ఢిల్లీలో జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం సాయం)
కేవలం ఈ వృత్తి మీదే ఆధారపడిన వారు కేసులు లేక జీవనం కొనసాగించడం కష్టంగా ఉందని వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని బార్ కౌన్సిల్ విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పందిన ప్రభుత్వం వారిని ఆదుకునేందుకు రూ. 25 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఇందుకు గాను బార్‌కౌన్సిల్ సభ్యులు అనంతసేన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి