
మాట్లాడుతున్న మంత్రి ఈటల రాజేందర్
సాక్షి, హుజూరాబాద్: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే మొదటిస్థానంలో ఉందని ఆపద్ధర్మ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం మండలంలోని శాలపల్లి– ఇందిరానగర్‌కాలనీలో ఈటల రాజేందర్‌కు మద్దతుగా నియోజకవర్గస్థాయి రైతు ఆత్మీయ సమ్మేళన సభ మార్కెట్ చైర్మన్ ఎడవెల్లి కొండాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో ఈటల మాట్లాడుతూ... పోరాడి సాధించుకున్న తెలంగాణలో రైతుల కష్టాలను దూరం చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రజల కష్టాలనుంచే పథకాలు అమలు చేశామని పేర్కొన్నారు. రైతుబంధు పథకం ఇవ్వాలనుకున్న సమయంలో కొంత మంది 5 నుంచి 10 ఎకరాలు వరకు సీలింగ్ పెట్టాలని సూచించిన క్రమంలో కేసీఆర్ ఒప్పుకోలేదని గుర్తు చేశారు.
వందలాది ఎకరా లు కలిగినఉన్న రైతులు అక్కడక్కడ మా త్రమే ఉంటారని, రైతులందరికి రైతుబంధు అ మలుచేయాలని కేసీఆర్ సూచించారని తెలిపా రు. గత ప్రభుత్వాలు ఏనాడు రైతుల కోసం పథకాలు తీసుకురాలేదని విమర్శించారు. రైతు బంధు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నా రు. వచ్చే వానకాలం వరకు కాలువలు, ప్రాజెక్టు లు నిండుకుండలా మారుతాయన్నారు. రానున్న రోజుల్లో సాగునీళ్లు ఇస్తామంటే వద్దనే పరిస్థితి ఉంటుందని జోష్యం చెప్పారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో కరువంటే ఎం టో తెలియకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ని యోజకవర్గ ప్రజలకు కొడుకుగా ఉంటూ, మచ్చ తేకుండా పని చేస్తున్న తనను ఆశీర్వదించాలని కోరారు.
వేగంగా ప్రాజెక్టుల నిర్మాణాలు..
ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ప్రాజెక్ట్‌ల నిర్మాణాలు వేగవతం అయ్యాయన్నారు. కోటి ఎకరాలకు సాగు నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతోనే కేసీఆర్ ప్రాజెక్ట్ నిర్మాణాలకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. దక్షిణభారతదేశంలోని సిమెంట్ కంపెనీల్లో 70 శాతం తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌కు వినియోగిస్తున్నమంటే ప్రభుత్వ పనితీరును అర్థం చేసుకోవాలన్నారు. వచ్చే రెండేళ్లలో తెలంగాణ రాష్ట్రమే ఇతర రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా చేసే స్థాయి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ పార్టీకి మద్దతుగా నిలువాలని కోరా రు. మంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమునారెడ్డి, డాక్టర్ ఎడవెల్లి విజేందర్‌రెడ్డి, నాయకులు చొల్లేటి కిషన్‌రెడ్డి, కంకణాల విజయారెడ్డి, భగవాన్‌రెడ్డి, కొత్త అశోక్‌రెడ్డి, సాదవరెడ్డి, సురేందర్‌రెడ్డి, యుగేందర్‌రెడ్డి, పోలంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ప్రదీప్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, నర్సింహరెడ్డి , కేసిరెడ్డి లావణ్య, శోభారాణి, రమాదేవి పాల్గొన్నారు.