పోలవరం కేసుల్లో తెలంగాణ సర్కార్ ఇంప్లీడ్ | telangana decides to implied in Polavaram case | Sakshi
Sakshi News home page

పోలవరం కేసుల్లో తెలంగాణ సర్కార్ ఇంప్లీడ్

Jul 13 2014 1:43 AM | Updated on Aug 21 2018 8:34 PM

పోలవరం ప్రాజెక్టు వివాదంపై సుప్రీంకోర్టులో ఉన్న నాలుగు కేసుల్లోనూ ప్రభుత్వపరంగానే ఇంప్లీడ్ కావాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది.

 సాక్షి ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు వివాదంపై సుప్రీంకోర్టులో ఉన్న నాలుగు కేసుల్లోనూ ప్రభుత్వపరంగానే ఇంప్లీడ్ కావాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోకి చేర్చే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో, రాజ్యసభలో అడ్డుకోవటానికి రాజకీయ ప్రయత్నాలు కొనసాగిస్తూనే మరోవైపు న్యాయపోరాటాన్ని విస్తృత స్థాయిలో చేయాలని టీ-సర్కార్ భావిస్తోంది. ప్రాజెక్టు వివాదంపై జలవనరుల నిపుణుడు రిటైర్డ్ సీఐ ఆర్. విద్యాసాగర్‌రావు, సీనియర్ అడ్వొకేట్ రామకృష్ణారావులు వేసిన కేసులతోపాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు కూడా కేసులు వేశాయి. వీటిల్లో రాష్ట్ర ప్రభుత్వం ‘కన్‌సర్న్‌డ్ పార్టీ’గా ఇంప్లీడ్ కావాలని నిర్ణయించింది. ‘ఇప్పటిదాకా తెలంగాణ ప్రజల వాణి వినిపించడానికి ఏ అవకాశమూ లేకుండా పోయింది. ఇప్పుడు ప్రత్యేకంగా రాష్ట్రం ఏర్పడింది. అందుకని ఒక రాష్ట్ర ప్రభుత్వంగా మనవాదనను బలంగా వినిపించే వీలు కలిగింది.’ అని మంత్రి హరీశ్‌రావు ‘సాక్షి’తో తెలిపారు. ఈ కేసులో వాదించేందుకు సర్కార్ గుర్తించిన కొన్ని ముఖ్యాంశాలు...
 
  పోలవరాన్ని జాతీయప్రాజెక్టు హోదాలో  కేంద్ర మే నిర్మిస్తూ, పునరావాసం- పునర్నిర్మాణాన్ని చేపడుతున్నందున ఇక ఆయా మండలాలను ఆంధప్రదేశ్‌లో కలపాల్సిన అవసరమేమిటి?
  పొరుగు రాష్ట్రాలు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లతోపాటు తెలంగాణ ప్రస్తావిస్తున్న అభ్యంతరాల్ని ఎందుకు పట్టించుకోవడం లేదు?
  ముంపుప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం వల్ల తెలంగాణ కోల్పోతున్న భారీ ఖనిజసంపద, అటవీసంపదపై కేంద్రం ఎందుకు మాట్లాడడం లేదు?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement