breaking news
implied
-
రఘురామరాజు ఇంప్లీడ్ పిటిషన్‌పై తక్షణ విచారణ అవసరం లేదు
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించిన వాస్తవాలను ప్రజలకు తెలిపేందుకు అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో తనను కూడా ప్రతివాదిగా చేర్చుకుని తన వాదనలు వినాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్ విషయంలో హైకోర్టు సానుకూలంగా స్పందించలేదు. ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందని రఘురామకృష్ణరాజును ప్రశ్నించింది. పిటిషనర్ వంటి రాజకీయ నాయకుడు దాఖలు చేసిన ఈ ఇంప్లీడ్ పిటిషన్‌ను అనుమతిస్తే ఈ వ్యవహారం రాజకీయరంగు పులుముకుంటుందని వ్యాఖ్యానించింది. ఈ ఇంప్లీడ్ పిటిషన్ విషయంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ఇదే సమయంలో ఏఏజీ సుధాకర్‌రెడ్డి, సీఐడీ చీఫ్ సంజయ్ మాట్లాడిన మాటలకు సంబంధించిన వివరాలను తర్జుమా చేసి తమ ముందు ఉంచకపోవడంపై పిటిషనర్‌ను హైకోర్టు నిలదీసింది. ఏఏజీ, సీఐడీ చీఫ్ ఏ నిబంధనలు ఉల్లంఘించారో, వారిపై ఏం చర్యలు కోరుతున్నారో చెప్పాలంది. నిబంధనల ప్రకారం వారిని తొలగించడమో, సస్పెండ్ చేయడమో చేయాలని పిటిషనర్ న్యాయవాది గిరిబాబు తెలిపారు. చంద్రబాబు కేసు వివరాలను వారు బహిర్గతం చేశారని, ఇది ఎంతమాత్రం సరికాదని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. స్కిల్ కుంభకోణం కేసు లేదా ఇతర ఏ కేసుకు సంబంధించిన సమాచారాన్ని కూడా బహిర్గతం చేయకుండా, ఎలాంటి సమావేశాలు నిర్వహించకుండా అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, సీఐడీ చీఫ్ సంజయ్‌లను ఆదేశించాలని కోరుతూ ఏపీ యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్ అధ్యక్షుడు ఎన్.సత్యనారాయణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంలో తనను కూడా ప్రతివాదిగా చేర్చుకోవాలంటూ రఘురామకృష్ణరాజు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై బుధవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి ప్రజా సంక్షేమం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పలు విధానపరమైన నిర్ణయాలను ప్రశ్నిస్తూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై విచారణ నుంచి న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు తప్పుకున్నారు. దీంతో జస్టిస్ రఘునందన్‌రావు సభ్యుడిగా లేని బెంచ్ ముందు ఈ వ్యాజ్యాన్ని ఉంచాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
పోలవరం కేసుల్లో తెలంగాణ సర్కార్ ఇంప్లీడ్
సాక్షి ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు వివాదంపై సుప్రీంకోర్టులో ఉన్న నాలుగు కేసుల్లోనూ ప్రభుత్వపరంగానే ఇంప్లీడ్ కావాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోకి చేర్చే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో, రాజ్యసభలో అడ్డుకోవటానికి రాజకీయ ప్రయత్నాలు కొనసాగిస్తూనే మరోవైపు న్యాయపోరాటాన్ని విస్తృత స్థాయిలో చేయాలని టీ-సర్కార్ భావిస్తోంది. ప్రాజెక్టు వివాదంపై జలవనరుల నిపుణుడు రిటైర్డ్ సీఐ ఆర్. విద్యాసాగర్‌రావు, సీనియర్ అడ్వొకేట్ రామకృష్ణారావులు వేసిన కేసులతోపాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు కూడా కేసులు వేశాయి. వీటిల్లో రాష్ట్ర ప్రభుత్వం ‘కన్సర్న్డ్ పార్టీ’గా ఇంప్లీడ్ కావాలని నిర్ణయించింది. ‘ఇప్పటిదాకా తెలంగాణ ప్రజల వాణి వినిపించడానికి ఏ అవకాశమూ లేకుండా పోయింది. ఇప్పుడు ప్రత్యేకంగా రాష్ట్రం ఏర్పడింది. అందుకని ఒక రాష్ట్ర ప్రభుత్వంగా మనవాదనను బలంగా వినిపించే వీలు కలిగింది.’ అని మంత్రి హరీశ్‌రావు ‘సాక్షి’తో తెలిపారు. ఈ కేసులో వాదించేందుకు సర్కార్ గుర్తించిన కొన్ని ముఖ్యాంశాలు... పోలవరాన్ని జాతీయప్రాజెక్టు హోదాలో కేంద్ర మే నిర్మిస్తూ, పునరావాసం- పునర్నిర్మాణాన్ని చేపడుతున్నందున ఇక ఆయా మండలాలను ఆంధప్రదేశ్‌లో కలపాల్సిన అవసరమేమిటి? పొరుగు రాష్ట్రాలు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లతోపాటు తెలంగాణ ప్రస్తావిస్తున్న అభ్యంతరాల్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? ముంపుప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం వల్ల తెలంగాణ కోల్పోతున్న భారీ ఖనిజసంపద, అటవీసంపదపై కేంద్రం ఎందుకు మాట్లాడడం లేదు?