విద్యుత్, ఆర్టీసీ ఛార్జీల పెంపును తెలంగాణ కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి మాట్లాడుతూ ఛార్జీల పెంపుతో
హైదరాబాద్ : విద్యుత్, ఆర్టీసీ ఛార్జీల పెంపును తెలంగాణ కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి మాట్లాడుతూ ఛార్జీల పెంపుతో ప్రభుత్వం పేద ప్రజలపై 1800 కోట్ల భారాలు మోపిందన్నారు. కాంట్రాకర్లకు, ధనవంతులకు, వ్యాపారులకు ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ప్రాధాన్యత లేని పనులకు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారని, పేద ప్రజలను టీఆర్ఎస్ ప్రభుత్వం వెన్నుపొడిచిందని మల్లు రవి వ్యాఖ్యానించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ధరలు పెంచారని అన్నారు. పెంచిన విద్యుత్, ఛార్జీలను వెంటనే తగ్గించాలని, లేకుంటే తెలంగాణా వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయ ఎదుట ధర్నాలు, నిరసనలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.