తెలంగాణ ప్రజలకు కేసీఆర్ వరాల జల్లు | Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్రజలకు కేసీఆర్ వరాల జల్లు

Published Wed, Jul 16 2014 9:53 PM

తెలంగాణ ప్రజలకు కేసీఆర్ వరాల జల్లు - Sakshi

హైదరాబాద్: ఎన్నికల హామీలను నెరవేర్చేదిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బుధవారం సాయంత్రం జరిగిన కేబినెట్ సమావేశంలో.. రైతుల రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించారు. బంగారంపై తీసుకున్న రుణాలు కూడా మాఫీ చేయడానికి కేబినెట్ ఆమోదించింది. దీనివల్ల 39 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు లబ్ది చేకూరుతుందని కేసీఆర్ ప్రకటించారు. కేబినెట్లో తీసుకున్న ఇతర కీలక నిర్ణయాలు..

  • అమర వీరులకు కుటుంబాలకు 10 లక్షల రూపాయిల ఎక్స్గ్రేసియా
  • అమర వీరుల పిల్లలకు ఉచిత విద్య, అర్హులైన వారికి ఉద్యోగం
  • దళిత, గిరిజన అమ్మాయిల పెళ్లిళ్ల కోసం కల్యాణ లక్ష్మి పథకం, 50 వేల రూపాయిల సాయం
  • నిరుపేద దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ
  • టీ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ స్థాయి స్కేల్
  • ఎస్టీ, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్పై కమిటీలు
  • టీ ఎన్ఆర్ఐలకు కేరళ తరహా సంక్షేమ బోర్డు
  • వృద్ధులు, వితంతువులకు వెయ్యి రూపాయిల పింఛన్
  • 2011 నుంచి ఉద్యమ కారులపై ఉన్న కేసుల ఎత్తివేత
  • 1956కు ముందు తెలంగాణలో స్థిరపడ్డ వారికే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వర్తింపు
  • వ్యవసాయ యూనివర్సీటీకి ప్రొ. జయశంకర్ పేరు
  • అన్ని ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగుల పర్మినెంట్
     

Advertisement

తప్పక చదవండి

Advertisement