11న తెలంగాణ స్పీకర్ ఎన్నిక | Telangana Assembly speaker to be elected on june 11th | Sakshi
Sakshi News home page

11న తెలంగాణ స్పీకర్ ఎన్నిక

Jun 7 2014 3:10 PM | Updated on Sep 2 2017 8:27 AM

11న తెలంగాణ స్పీకర్ ఎన్నిక

11న తెలంగాణ స్పీకర్ ఎన్నిక

ఈ నెల 11న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ను ఎన్నుకుంటారు.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు అధికార టీఆర్ఎస్ నాయకులు ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. శాసనసభ వ్యవహారాల మంత్రి టీ హరీష్ రావు ఈ విషయాలను వెల్లడించారు. సొమవారం ఉదయం 9:30 గంటలకు ప్రొటెం స్పీకర్గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. అనంతరం 11 నుంచి జానారెడ్డి ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారని హరీష్ రావు తెలిపారు.

ఈ నెల 11న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ను ఎన్నుకుంటారు. అదే రోజున గవర్నర్ ప్రసంగం, బీఏసీ సమావేశం ఉంటుందని హరీష్ రావు తెలిపారు. శాసనమండలి చైర్మన్గా డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ వ్యవహరించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement