ఆరేళ్లు ప్రేమించి...పెళ్లి మాత్రం వద్దన్నాడు | teenage girl cheated by lover | Sakshi
Sakshi News home page

ఆరేళ్లు ప్రేమించి...పెళ్లి మాత్రం వద్దన్నాడు

May 3 2015 11:55 PM | Updated on Apr 8 2019 6:21 PM

ప్రేమ పేరుతో లోబరుచుకుని, చివరికి పెళ్లికి నిరాకరించిన యువకుడిపై పోలీసులుకేసు నమోదు చేశారు.

హయత్‌నగర్(రంగారెడ్డి జిల్లా): ప్రేమ పేరుతో లోబరుచుకుని, చివరికి పెళ్లికి నిరాకరించిన యువకుడిపైపోలీసులుకేసు నమోదు చేశారు. ఈ ఘటన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లా కొలిచెర్లకు చెందిన అంజయ్య కుమారుడు శ్రీనివాస్ (28), హయత్‌నగర్‌లోని శాంతినగర్‌కు చెందిన ఓ యువతి (25) నిజామాబాద్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో 2011 వరకు బీటెక్ చదువుకున్నారు. ఆ సమయంలో వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది.

 

పెళ్లి చేసుకుంటానని చెప్పి శ్రీనివాస్ ఆ యువతితో శారీరక సంబంధం ఏర్పరచుకున్నాడు. గత ఆరేళ్లుగా వీరి సంబంధం కొనసాగుతోంది. తీరా పెళ్లి చేసుకొమ్మని యువతి ఒత్తిడి చేయగా శ్రీనివాస్ నిరాకరించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement