మమ్ముల్ని విడిచి వెళ్లొద్దు సారూ..

Teacher Transfer Students Rasta Roko In Adilabad - Sakshi

తలమడుగు: ‘ప్లీస్‌ సార్‌.. మమ్ముల్ని విడిచి వెళ్లొ ద్దు సారూ..’ అంటూ విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. విద్యార్థులు తనపట్ల చూపిస్తున్న అభిమానానికి భావోద్వేగంతో ఆ ఉపాధ్యాయుడి కళ్లూ చెమ్మగిల్లాయి. ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలం కజ్జర్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ పాఠశాలలో ఉపాధ్యాయుడు శ్రీకాంత్‌ ఆరేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. తన ఏకైక కుమార్తె లహస్యను తాను పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాలలోనే ఐదో తరగతి వరకు చదివించారు.

ప్రస్తుతం ఆరో తరగతి కూడా పక్కనే ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిస్తున్నారు. అలాగే శ్రీకాంత్‌ బోధనలోనూ ఆందరికి అదర్శంగా నిలిచారు. తరగతి పేపర్ల మూల్యాంకనానికి వచ్చే డబ్బులను విద్యార్థులకు, పాఠశాల అభివృద్ధికి ఖర్చు పెట్టారు. తన సొంత డబ్బుతో పేద విద్యార్థులకు బూట్లు, నోట్‌బుక్స్‌ అందించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికి తన వంతు కృషి చేశారు. తాజా బదిలీల్లో ఆయన భీంపూర్‌ మండలం అంతార్‌గావ్‌ పాఠశాలకు బదిలీ అయ్యారు. గురువారం పాఠశాల నుంచి వెళ్తుండగా విద్యార్థులు, గ్రామస్తులు అడ్డుకుని, తమను విడిచి వెళ్లవద్దని వేడుకున్నారు. ఉద్యోగులకు బదిలీ సహజమేనని, మిమ్మల్ని వీడి వెళ్తున్నందుకు తనకూ బాధగా ఉందని పేర్కొనడంతో విద్యార్థులు కంటతడి పెట్టుకోవడం కనిపించింది. 

మా ఉపాధ్యాయులు మాకు కావాలి

జన్నారం(ఖానాపూర్‌): ‘ఇన్ని రోజులు మాకు చక్కగా చదువు చెప్పిన సార్లను బదిలీ చేశారు. మా ఉపాధ్యాయులను బదిలీ రద్దు చేసి ఇక్కడే కొనసాగించాల’ని కోరుతూ విద్యార్థులు ఏకంగా రోడ్డెక్కి రాస్తారోకో చేశారు. మంచిర్యాల జి ల్లా ఇందన్‌పల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజునాయక్, తెలుగు ఉపాధ్యాయుడు సుభాష్‌ ఇటీవల బదిలీ అయ్యారు. మా యోగక్షేమాలు చూసుకోవడమే కాకుండా మం చిగా చదువు నేర్పించిన ఉపాధ్యాయులను బది లీ చేయొద్దని కోరుతూ ప్రధాన రహదారిపై గం టసేపు రాస్తారోకో చేశారు. డీఈవో స్పందించి తమకు న్యాయం చేయాలని విద్యార్థులు కోరారు. మిగతా ఉపాధ్యాయులు వారికి నచ్చజెప్పి ఈ విషయాన్ని డీఈవో దృష్టికి తీసుకెళ్తామని తెలపడంతో రాస్తారోకో విరమించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top