ఈ నెలాఖరులో మోడల్ స్కూల్ పోస్టుల భర్తీ | teacher posts in model school to be filled within a month | Sakshi
Sakshi News home page

ఈ నెలాఖరులో మోడల్ స్కూల్ పోస్టుల భర్తీ

Aug 23 2014 2:36 AM | Updated on Oct 2 2018 4:01 PM

మోడల్ స్కూళ్లలో నిలిచిపోయిన పీజీటీ, టీజీటీ పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్ ను ఈ నెలాఖరులో నిర్వహించేందుకు పాఠశాల విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తోంది

 సాక్షి, హైదరాబాద్: మోడల్ స్కూళ్లలో నిలిచిపోయిన పీజీటీ, టీజీటీ పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్ ను ఈ నెలాఖరులో నిర్వహించేందుకు పాఠశాల విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తోంది. భర్తీ ప్రక్రియ సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను  25 లేదా 26 తేదీల్లో జారీ చేయనున్నారు. ఏడాదిగా పెండింగ్‌లో ఉన్న ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని మోడల్ స్కూ ల్స్ ఎక్స్‌అఫీషియో పీడీ జగదీశ్వర్ తెలిపారు. ఈ పోస్టుల భర్తీలో తెలుగు మీడియం అభ్యర్థులను అనుమతించని కారణంగా న్యాయ వివాదం ఏర్పడి ఆలస్యమైన సంగతి తెలిసిందే. దీంతో 1000 పీజీటీ,  600 వరకు టీజీటీ పోస్టుల భర్తీ ఆగిపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement