
ఖమ్మం జెడ్పీ పీఠం టీడీపీ వశం
ఖమ్మం జిల్లా పరిషత్ పీఠాన్ని వామపక్షాల సాయంతో తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. గు
ఖమ్మం: ఖమ్మం జిల్లా పరిషత్ పీఠాన్ని వామపక్షాల సాయంతో తె లుగుదేశం పార్టీ గెలుచుకుంది. గురువారం జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు. మొత్తం 39 మంది సభ్యులున్న జెడ్పీలో టీడీపీకి 19 మంది సభ్యుల బలముంది. వీరికి సీపీఐ, సీపీఎంలకు చెందిన ముగ్గురు సభ్యులు మద్దతివ్వడంతో 22 ఓట్లతో టీడీపీ రెండు పదవులను కైవసం చేసుకుంది.
ఆ పార్టీ తరఫున చైర్‌పర్సన్‌గా గడిపల్లి కవిత, వైస్‌చైర్మన్‌గా బరపాటి వాసుదేవరావు ఎన్నికయ్యారు. మద్దతిచ్చినందుకు గాను సీపీఐ, సీపీఎంలకు కో-ఆప్షన్ పదవులు దక్కాయి. నలుగురు వైఎస్సార్‌సీపీ సభ్యులు తటస్థంగా ఉండగా, ముగ్గురు న్యూడెమోక్రసీ సభ్యులు ఎన్నిక ప్రక్రియను బహిష్కరించారు.