ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో సీపీఐ అభ్యర్థిని బలపరుస్తూ తమ పార్టీ ప్రజాప్రతినిధులు ఓటింగ్‌లో పాల్గొంటారని, కానీ ఇతర జిల్లాల్లో ఓటింగ్‌కు దూరంగా ఉంటారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు.
నల్లగొండ టౌన్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో సీపీఐ అభ్యర్థిని బలపరుస్తూ తమ పార్టీ ప్రజాప్రతినిధులు ఓటింగ్‌లో పాల్గొంటారని, కానీ ఇతర జిల్లాల్లో ఓటింగ్‌కు దూరంగా ఉంటారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. మంగళవారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ మేరకు తమ పార్టీ ప్రజాప్రతినిధులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రహసనంగా మారాయని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్.. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ఓట్ల కోసం కోట్ల ఆఫర్లు ఇస్తోందని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న కుళ్లు రాజకీయాలను ప్రజలు ఈసడించుకుంటున్నారన్నారు.