'సినిమా హాల్స్ యజమానులను వదలం' | Talasani srinivas yadav review meeting in commercial tax department | Sakshi
Sakshi News home page

'సినిమా హాల్స్ యజమానులను వదలం'

Mar 5 2015 2:44 PM | Updated on Sep 2 2017 10:21 PM

'సినిమా హాల్స్ యజమానులను వదలం'

'సినిమా హాల్స్ యజమానులను వదలం'

సినిమా హాల్స్ యజమానులు పన్నులు చెల్లించడం లేదని... వారిని వదిలిపెట్టమని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ స్పష్టం చేశారు.

హైదరాబాద్: సినిమా హాల్స్ యజమానులు పన్నులు చెల్లించడం లేదని... వారిని వదిలిపెట్టమని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్లో వాణిజ్యపన్నులశాఖలో సమీక్ష సమావేశాన్ని మంత్రి తలసాని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాజధాని పరిధిలోని వస్త్ర, కార్పొరేట్, పెద్ద బంగారం షాపుల వ్యాపారులు పన్నులు చెల్లించడం లేదన్నారు. వస్త్రవ్యాపారులపై వ్యాట్ విధిస్తామని చెప్పారు.

పన్నులు కట్టని వ్యాపారుల వివరాలు ఇచ్చే వారికి పారితోషికం అందిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి పన్నులు చెల్లించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలంగాణ ప్రజలకు తలసాని ఈ సందర్బంగా పిలుపునిచ్చారు. అలాగే కోఠి ఆసుపత్రిలో విద్యుత్ సమస్యను పరిష్కరించామని తలసాని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement