బీజేపీకి షాక్‌.. శివసేన నుంచి పోటీ | Suryanarayana Gupta COntest Form Nizamabad Urban As Rebel | Sakshi
Sakshi News home page

బీజేపీకి షాక్‌.. శివసేన నుంచి పోటీ

Nov 19 2018 12:43 PM | Updated on Nov 19 2018 2:25 PM

Suryanarayana Gupta COntest Form Nizamabad Urban As Rebel - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : రెబల్స్‌ బెడద మహాకూటమినే కాదు బీజేపీకి కూడా వెంటాడుతోంది. ఈ పార్టీ నుంచి టికెట్‌ అశించిన నిజామాబాద్‌ బీజేపీ సీనియర్‌ నేత, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ సూర్యనారాయణ గుప్తా సీటు రాకపోవడంతో నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి బీజేపీ రెబల్‌గా పోటీకి దిగారు. శివసేన పార్టీ తరుఫున బరిలోకి దిగిన గుప్తా సోమవారం కాషాయ జెండాల నడుమ భారీ ర్యాలీని నిర్వహించి నామినేషన్‌ దాఖలు చేశారు. బీజేపీ బలంగా భావించే ఈస్థానంలో ఆపార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ పోటీపడుతున్నారు.

గుప్తా రెబల్‌గా బరిలోకి దిగడంతో ఈస్థానంలో బీజేపీకి పెద్దదెబ్బగా ఈ పార్టీ నేతలు భావిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన శివసేన పార్టీ తరుఫున తెలంగాణలో పోటీ చేస్తున్న ఏకైక అభ్యర్థి నారాయణ గుప్తానే కావడం విశేషం. ఇదిలావుండగా ఆయన రాజీనామాను బీజేపీ అధిష్టానం ఇంకా ఆమోదించలేదని.. గుప్తాకు శ్రమను గుర్తించి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌ గుప్తా తెలిపారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement