ఆత్మహత్యాయత్నం చేసిన కార్మికుడు మృతి | ​Suicide attempt by sirpur paper mills employee dies in hospital | Sakshi
Sakshi News home page

ఆత్మహత్యాయత్నం చేసిన కార్మికుడు మృతి

Apr 12 2015 6:20 PM | Updated on Nov 6 2018 7:56 PM

ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నం చేసిన శంకర్ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందాడు.

కాగజ్‌నగర్: ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నం చేసిన శంకర్ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందాడు. ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన శంకర్ సిర్పూర్ పేపర్‌మిల్స్‌లో కార్మికుడిగా పనిచేసేవాడు. పేపర్‌మిల్స్ మూతబడి 7 నెలలు కావడం, వేతన బకాయిలు ఇప్పటికీ అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక శనివారం అర్ధరాత్రి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.

మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు శంకర్ని హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలించారు.  పరిస్థితి విషమించడంతో శంకర్ ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement