గ్రామసందర్శనకు అధికారులు సకాలంలో హాజరుకాకపోవడంతో జగిత్యాల సబ్ కలెక్టర్ శశాంకకు వేచి చూడాల్సిన...
గ్రామసందర్శనకు సకాలంలో హాజరుకాని వైనం
జగిత్యాల రూరల్ : గ్రామసందర్శనకు అధికారులు సకాలంలో హాజరుకాకపోవడంతో జగిత్యాల సబ్ కలెక్టర్ శశాంకకు వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురైంది. ఉదయం 10 గంటలకు గ్రామ సందర్శన ప్రారంభంకావాల్సి ఉండగా.. 10.10 గంటలకు సబ్‌కలెక్టర్ గ్రామానికి చేరుకున్నారు. అధికారులెవరూ లేకపోవడంతో అరగంటపాటు గ్రామపంచాయతీలోనే ఎదురుచూశారు. ఎంఈవో మద్దెల నారాయణ హాజరుకాగా 10.45 గంటలకు ఎంపీడీవో శ్రీలతరెడ్డి వచ్చారు.
ఇద్దరు అధికారులను వెంటబెట్టుకుని ప్రాథమిక పాఠశాల తనిఖీకి వెళ్లగా.. 11 గంటలకు ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రాజశ్రీ హాజరయ్యారు. అరుుతే అధికారులను మందలించకుండానే సబ్‌కలెక్టర్ గ్రామసందర్శనలో పాల్గొన్నారు.