గురుకుల ప్రిన్సిపాల్‌ను తొలగించాలి

Students Protest On Gurukula Principal In Nizamabad - Sakshi

సాక్షి, మద్నూర్‌: గురుకుల ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌ వివాదాస్పదంగా ఉంటూ మహిళా ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడేవాడని, అతడిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని యువకులు, పెద్దలు డిమాండ్‌ చేశారు. ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌ లైంగిక వేధింపులకు నిరసనగా మండల కేంద్రంలోని పాత బస్టాండ్‌ వద్ద జాతీయ రహదారిపై మంగళవారం గ్రామస్తులు పెద్ద సంఖ్యలో బైఠాయించారు. ప్రిన్స్‌పాల్‌ డౌన్‌ డౌన్‌ అంటూ వారు నినదించారు. ప్రిన్స్‌పాల్‌ను జాబ్‌ నుంచి తొలగించకుండా హైదరాబాద్‌ కార్యాలయానికి అటాచ్‌ చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు. బహిరంగ శిక్ష విధించాలని వారు డిమాండ్‌ చేశారు. అనంతరం ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌ దిష్టిబొమ్మ దహనం చేశారు. రాస్తారోకో, ధర్నాతో జాతీయ రహదారిపై రెండు వైపుల వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఎస్సై సురేశ్‌ రాస్తారోకో చేస్తున్న వారికి సముదాయించి ధర్నా విరమింపజేశారు.

మద్నూర్‌లో జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్న గ్రామస్తులు

పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత.. 
ప్రిన్స్‌పాల్‌ శ్రీనివాస్‌ను మంగళవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నామని ఎస్సై సురేశ్‌ తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లో ఉన్న ప్రిన్సిపాల్‌తో పా టు మరో ముగ్గురు పాఠశాల సిబ్బంది ఎందుకు ఉన్నారని యువకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడికి పోలీస్‌ స్టేషన్‌లో సెల్‌ఫోన్‌ మాట్లాడడం ఎలా అనుమతించారని యువకులు పోలీసులను ప్రశ్నించారు. దీంతో ఎస్సై ముగ్గురి ఉపాధ్యాయుల ను వెళ్లిపోవాలని సూచించారు. ప్రిన్సిపాల్‌ వద్ద ఉన్న రెండు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమాలకు సహకరిస్తున్నారంటూ ముగ్గురు సి బ్బందిపై గ్రామస్తులు దాడి చేశారు. పోలీస్‌ వాహనంలో ముగ్గురి సిబ్బందిని పాఠశాలకు తరలిస్తుండ గా యువకులు, గ్రామస్తులు అడ్డుకున్నారు. పోలీసు లు యువకులను చెదరగొట్టారు. సెక్షన్‌ 354ఏ, 509, 506 ప్రకారం కేసు నమోదు చేసి శ్రీనివాస్‌ను రిమాండ్‌కు తరలించామని ఎస్సై వెల్లడించారు. 

హైదరాబాద్‌ కార్యాలయానికి సరెండర్‌ 
లైంగిక వేధింపులకు పాల్పడిన గురుకుల ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌పై వేటు పడింది. ప్రిన్సిపాల్‌ బాధ్యతల నుంచి తప్పిస్తూ మరో ఉపాధ్యాయిని సునీతకు ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పాఠశాలకు మెయిల్‌ వచ్చింది. ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌ను హైదరాబాద్‌లోని గురుకుల సొసైటీ కార్యదర్శికి అటాచ్‌ చేశారు. ప్రిన్సిపాల్‌ తన ప్రాబల్యంతో పోస్టింగ్‌ తెచ్చుకుంటాడని యువకులు మండిపడుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top