ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 10న నిర్వహించ తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్ విజయవంతం కావాలని కోరుతూ విద్యార్థులు సోమవారం క్యాంపస్‌లో 5 కే రన్ నిర్వహించారు.
ఓయూలో ఉద్రిక్తత
Dec 7 2015 11:54 AM | Updated on Jul 31 2018 4:48 PM
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 10న నిర్వహించ తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్ విజయవంతం కావాలని కోరుతూ విద్యార్థులు సోమవారం క్యాంపస్‌లో 5 కే రన్ నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల నుంచి ఎన్‌సీసీ గేటు వరకు రన్ ను కొనసాగిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్వల్స ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పలువురు విద్యార్థులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా బీఫ్ ఫెస్టివల్ నిర్వహించి తీరుతామన్నారు. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారీగా పోలీసు బందోబస్తు, పికెట్‌ల ఏర్పాటు చేశారు. మరో వైపు బీఫ్ ఫెస్టివల్‌ను వ్యతిరేకిస్తూ 9 వ తేదీన ఏబీవీపీ చలో ఉస్మానియాకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement