వక్ఫ్‌బోర్డు భూముల ఆక్రమణపై కఠిన చర్యలు  

Strict actions taken On occupied Land Of Wakf Board In Gajwel - Sakshi

తెలంగాణ రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ఓఎస్‌డీ మహ్మద్‌ ఖాసీమ్‌

‘అన్యాక్రాంతం’పై  గజ్వేల్‌లో విచారణ 

సాక్షి, గజ్వేల్‌(సిద్ధిపేట) : వక్ఫ్‌బోర్డు భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ఓఎస్‌డీ మహ్మద్‌ ఖాసీమ్‌ హెచ్చరించారు. ఈనెల 12న జిల్లాలో సాగుతున్న వక్ఫ్‌భూముల దందాపై ‘అన్యాక్రాంతం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన ఆయన శుక్రవారం గజ్వేల్‌లో పర్యటించి వక్ఫ్‌భూముల ఆక్రమణపై విచారణ చేపట్టారు. ముందుగా పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో రికార్డులను పరిశీలించిన ఆయన ఆ తర్వాత వక్ఫ్‌భూములను పరిశీలించారు. సర్వే నంబర్ల వారీగా భూముల వివరాలు, వివాదాలపై ఆరా తీశారు. నిబంధనలు విరుద్ధంగా వక్ఫ్‌భూములను ఆక్రమిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తయిన తర్వాత చర్యలుంటాయని స్పష్టం చేశారు. ఇంకా ఆయన వెంట ఉమ్మడి మెదక్‌ జిల్లా వక్ఫ్‌బోర్డు ఇ¯Œ ్సస్పెక్టర్‌ ఖాదర్, సర్వేయర్లు సుజన్, నాగరాజు తదితరులు ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top