నల్లగొండ పార్లమెంట్‌ పరిధిలో ఎవరి బలమెంత..? 

With The Start Of The Parliamentary Elections, There Is Talk Of Victory Over The Nalgonda Parliament - Sakshi

సాక్షిప్రతినిధి, సూర్యాపేట : పార్లమెంట్‌ ఎన్నికల సంగ్రామం మొదలు కావడంతో నల్లగొండ పార్లమెంట్‌ పరిధిలో విజయం ఎవరిదన్నది  జోరుగా చర్చ సాగుతోంది. బరిలో ఉండే అభ్యర్థులు ఎవరన్నది పార్టీలు ప్రకటించకున్నా ఏ పార్టీ విజయం సాధిస్తుందోనన్న రాజకీయ విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. గత పార్లమెంట్, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయని నేతలు, ఎంపీ టికెట్‌ ఆశిస్తున్న అభ్యర్థులు లెక్కలేస్తున్నారు.

2014లో ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యం
గత పార్లమెంట్‌ ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్‌ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు గాను ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు ఆధిక్యత రాగా ఒక్క నియోజకవర్గంలోనే టీఆర్‌ఎస్‌కు మెజార్టీ వచ్చింది. 2014 ఎన్నికల్లో  గుత్తా సుఖేందర్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగి ఆయన  సమీప టీడీపీ ప్రత్యర్థి టి.చిన్నపురెడ్డిపై 1,93,156 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. గుత్తాకు 4,72,093 ఓట్లు రాగా, చిన్నపురెడ్డికి 2,78,937 వచ్చాయి.

టీఆర్‌ఎస్‌ పక్షాన పోటీ చేసిన పి.రాజశ్వేరరెడ్డికి 2,60,677 ఓట్లు వచ్చి మూడో స్థానంలో నిలిచారు. సీపీఎం అభ్యర్థి ఎన్‌.నరసింహారెడ్డికి 54,423 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దేవరకొండలో 10,046, సాగర్‌లో 23,478, మిర్యాలగూడలో 29,623, కోదాడలో 18,316, హుజూర్‌నగర్‌లో 34,646, నల్లగొండలో 26,628 ఓట్ల మెజార్టీ రాగా, టీఆర్‌ఎస్‌కు సూర్యాపేటలో 2,652 ఓట్ల ఆధిక్యత వచ్చింది. న         ల్లగొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. సూర్యాపేటను టీఆర్‌ఎస్, దేవరకొండను సీపీఐ కైవసం చేసుకుంది. ఆ తర్వా త మారిన రాజకీయ సమీకరణాలతో మిర్యాలగూడ, దేవరకొండ ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరుకున్నారు. 

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే హవా..
గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్‌ పరిధిలో టీఆర్‌ఎస్‌ హవా కొనసాగింది. ఏడు నియోజకవర్గాల్లో హుజూర్‌నగర్‌ మినహా ఆరు నియోజకవర్గాలు ఆపార్టీ ఖాతాలో చేరాయి. అయితే ఓట్ల పరంగా చూస్తే ఆరు నియోజకవర్గాల్లో మొత్తం టీఆర్‌ఎస్‌కు 1,07,692 ఓట్ల మెజార్టీ వచ్చింది. కాంగ్రెస్‌ హుజూర్‌నగర్‌లో మాత్రమే 7,466 ఓట్ల మెజార్టీ సాధించింది. సూర్యాపేట, కోదాడ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ, నల్లగొండ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ గులాబీ జెండా ఎగురవేసింది.

పార్లమెంట్‌ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఈ అసెంబ్లీ ఎన్ని కల్లో ఆయా పార్టీల అభ్యర్థులకు వచ్చిన ఓట్ల పరంగా చూస్తే టీఆర్‌ఎస్‌కే మెజార్టీ ఉంది. çహుజూర్‌నగర్‌లో కాం గ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 7,466 ఓట్ల ఆధిక్యత పొందారు. అలాగే సూర్యాపేట ని యోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగి విజ యం సాధించిన గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి 5,967 ఓట్ల మె జార్టీ సాధించారు. కోదాడలో బొల్లం మల్లయ్యయాదవ్‌కు 756 ఓట్ల మెజార్టీ, మిర్యాలగూడ నియోజకవర్గంలో భాస్కర్‌రావుకు 30,652, నాగా ర్జునసాగర్‌లో నోముల నర్సింహయ్యకు 7,771, దేవరకొండ నియోజకవర్గంలో రమావత్‌ రవీంద్రకుమార్‌కు 38,848, నల్లగొండ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డికి 23,698 ఓట్ల ఆధిక్యత వచ్చింది.

ఎవరి అంచనా వారిదే..
గత పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మెజార్టీ రావడం.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఎక్కువ ఓట్లు రావడంతో నేతలు ఎవరి అంచనాల్లో వారున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే నల్లగొండ, భువనగిరి, ఖమ్మం పార్లమెంట్‌ స్థానాలపై కాంగ్రెస్‌ పార్టీ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ఈ నియోజకవర్గాల్లో ఆపార్టీకి.. టీఆర్‌ఎస్‌కు మధ్య అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల తేడా తక్కువగా ఉండడంతో విజయంపై ఆశలు పెట్టుకుంది.  అయితే ప్రధానంగా నల్లగొండ పార్లమెంట్‌ స్థానం విజయంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సవాల్‌గా తీసుకున్నారు.

ఇక్కడ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీనియర్‌ నేతలు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉండడంతో అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే.. కాంగ్రెస్‌కు షాక్‌ ఇవ్వాలని బలమైన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మెజార్టీ పెరుగుతుందని టీఆర్‌ఎస్, అసెంబ్లీ ఎన్నికల ఓట్లతో సంబంధం లేకుండా పార్లమెంట్‌ స్థానానికి ఎక్కువ ఓట్లు తమకు పడతాయని కాంగ్రెస్‌ ధీమా వ్యక్తం చేస్తున్నాయి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top