ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు | Srisailam Project Is In Danger Says Water Man Of India Rajendra Singh | Sakshi
Sakshi News home page

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు

Nov 21 2019 2:02 PM | Updated on Nov 21 2019 2:02 PM

Srisailam Project Is In Danger Says Water Man Of India Rajendra Singh - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదంలో ఉందని వెంటనే మరమ్మతులు చేపట్టకపోతే పెను విషాదం తప్పదని మెగసెసే అవార్డు గ్రహీత, వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా రాజేంద్రసింగ్‌ హెచ్చరించారు. ఏదైనా విపత్తు సంభవిస్తే సగం ఆంధ్రప్రదేశ్‌ కనిపించకుండా పోతుందని, దిగువన ఉన్న నాగార్జునసాగర్‌ ప్రాజెక్టూ కూలిపోతుందని పేర్కొన్నారు. శ్రీశైలం డ్యామ్‌ను సందర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సర్కార్‌ సత్వర చర్యలు తీసుకుంటే ఈ ప్రాజెక్టును పరిరక్షించుకోవచ్చని చెప్పారు. డ్యాం సమీప నిర్మాణాలపై దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వాలు ప్రాజెక్టులు నిర్మించడంతోపాటు వాటి నిర్వహణ బాధ్యతలనూ సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement