ఎన్నికల ఇంకు గురించి తెలుసా..?

Speciality Of Ink Mark In Elections - Sakshi

సాక్షి, కోదాడ : ఎన్నికల సమయంలో  దొంగ ఓట్లను నివారించడానికి, ఒకరు ఒకటి కంటే ఎక్కువ ఓట్లు వేయకుండా ఉండడానికి ఎన్నికల సంఘం ప్రతి ఓటరు ఎడమ చేతి చూపుడు వేలిపై ఇంకు గుర్తును వేస్తుంది. ఇది దాదాపు నెల రోజుల వరకు చెరిగిపోకుండా ఉంటుంది. ఈ ఇంకుకు పెద్ద చరిత్రనే ఉంది. దేశంలో జరిగిన 3వ సాధారణ ఎన్నికల నుంచి దీన్ని ఉపయోగిస్తున్నారు. దేశం మొత్తానికి అవసరమైన ఈ  ఇంకును ఒక్క కంపెనీ మాత్రమే తయారు చేస్తుంది. 1937 సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్‌ పట్టణంలో ఈ ఇంకు తయారీ పరిశ్రమను  ‘‘ మైసూర్‌ ల్యాక్‌ అండ్‌ పెయింట్స్‌ ’’ పేరుతో స్థాపించారు. మహా రాజ నల్‌వాడీ కృష్ణరాజ వడయార్‌ దీని వ్యవస్థాపకుడు. తర్వాత దీన్ని మైసూర్‌ పెయింట్స్‌ వార్నిష్‌గా పేరు మార్చారు. ప్రస్తుతం ఈ కంపెనీ కర్ణాటక ప్రభుత్వ ఆధీనంలో నడుస్తుంది.

1962 నుంచి ఎన్నికల సంఘం తమకు అవసరమయ్యే ఇంకును ఈ పరిశ్రమ నుంచి మాత్రమే కొనుగోలు చేస్తుంది. ఇది 5, 7, 5, 20, 50 మిల్లీలీటర్ల బాటిళ్లలో దొరుకుతుంది. 5 ఎంఎల్‌ బాటిల్‌ 300 మంది ఓటర్లకు సరిపోతుంది. ఈ పరిశ్రమ ఈ ఇంకును ఇతర దేశాలకు కూడా సరఫరా చేస్తుంది. మారుతున్న కాలంతో పాటు ఈ పరిశ్రమ కూడా ఆధునికీకరణ చెందింది. ఈ ఇంకుతో సులువుగా ఉపయోగించడానికి మార్కర్‌ పెన్నులను కూడా తయారీ చేస్తుంది. ఇతర దేశాలలో వీటిని వాడుతున్నారు. కానీ మనదేశంలో మాత్రం ఇంకా ఇంకును మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఈ ఇంకు  తయారీ అత్యంత రహస్యంగా సాగుతుంది. దీని తయారీలో ఉపయోగించే రసాయన ఫార్ములాను నేషనల్‌ ఫిజికల్‌ లాబోరేటరీ ఆఫ్‌ ఇండియా అత్యంత రహస్యంగా రూపొం ది స్తుంది.  ఇతరులకు దీని తయా రీ తెలియనీయరు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top