అజ్మీర్ ఉర్సుకు ప్రత్యేక రైళ్లు | Special trains for Ajmer urs celebrations | Sakshi
Sakshi News home page

అజ్మీర్ ఉర్సుకు ప్రత్యేక రైళ్లు

Apr 23 2014 5:32 AM | Updated on Aug 24 2018 6:44 PM

అజ్మీర్‌లో జరుగనున్న ఉర్సు ఉత్సవాలకు వెళ్లే ప్రయాణికుల కోసం నాంపల్లి,కాచిగూడ, ఒంగోలు, మచిలీపట్నంల నుంచి ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు మంగళవారం తెలిపారు.

సాక్షి, హైదరాబాద్ : అజ్మీర్‌లో జరుగనున్న ఉర్సు ఉత్సవాలకు  వెళ్లే  ప్రయాణికుల కోసం  నాంపల్లి,కాచిగూడ, ఒంగోలు, మచిలీపట్నంల  నుంచి  ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు  దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు మంగళవారం తెలిపారు. ఈ  మేరకు హైదరాబాద్-అజ్మీర్ ఉర్సు (07125/07126) స్పెషల్ ట్రైన్  మే 2వ తేదీన రాత్రి 8.10 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరుతుంది. ఇది సికింద్రాబాద్‌కు 8.30 కు చేరుకొని 8.35 గంటలకు అక్కడ నుంచి వెళుతుంది. మే4వ తేదీ ఉదయం 10.15 గంటలకు  అజ్మీర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మే 8వ తేదీన  ఉదయం 7 గంటలకు అజ్మీర్ నుంచి బయలుదేరి 9వ తేదీ రాత్రి 11 గంటలకు సికింద్రాబాద్‌కు,రాత్రి 11.45 గంటలకు నాంపల్లికి  చేరుకుంటుంది.
 
- కాచిగూడ-అజ్మీర్ (07129/07130) స్పెషల్ ట్రైన్ మే 3వ తేదీ రాత్రి 10.30 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి 5వ తేదీ ఉదయం 4.50 గంటలకు అజ్మీర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మే 7వ తేదీ సాయంత్రం 7.25 గంటలకు అజ్మీర్ నుంచి బయలుదేరి 9వ తేదీ ఉదయం 7 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. రాష్ట్రంలోని   మల్కాజిగిరి, మేడ్చెల్, కామారెడ్డి,నిజామాబాద్, బాసరలలో ఈ రైళ్లు ఆగుతాయి.
 -    ఒంగోలు-అజ్మీర్ (07227/07228) స్పెషల్ ట్రైన్ మే 4వ తేదీ ఉదయం 9 గంటలకు ఒంగోలు నుంచి బయలుదేరుతుంది. 12.25 గంటలకు విజయవాడ చేరుకుని, అక్కడి నుంచి మధ్యాహ్నం ఒంటిగంటకు బయలుదేరుతుంది.మే 5వ తేదీ రాత్రి 11.30 గంటలకు అజ్మీర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మే 8వ తేదీ సాయంత్రం 7.25 గంటలకు అజ్మీర్ నుంచి బయలుదేరి 10వ తేదీ  తెల్లవారు జామున 2.35 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. 2.50 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి ఉదయం 7 గంటలకు ఒంగోలు చేరుకుంటుంది. రాష్ట్రంలోని చీరాల,బాపట్ల,నిడుబ్రోలు,తెనాలి,న్యూగుంటూరు,విజయవాడ,మధిర,ఖమ్మం,మహబూబ్‌బాద్,వరంగల్, మంచిర్యాల,బెల్లంపల్లి,సిరిపూర్‌కాగజ్‌నగర్‌లలో ఆగుతుంది.
-   మచిలీపట్నం-అజ్మీర్ (07131/07132) ప్రత్యేక రైలు మే 4వ తేదీ ఉదయం 9 గంటలకు మచిలీపట్నం నుంచి బయల్దేరి 11 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి ఇది ఒంగోలు-అజ్మీర్ ట్రైన్‌కు లింక్ అవుతుంది. ఇది ఒంటిగంటకు విజయవాడ నుంచి బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో 10వ తేదీ  తెల్లవారు జామున 3.30 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి (అప్పటి వరకు ఇది అజ్మీర్-ఒంగోలు ట్రైన్‌కు లింక్ అయి ఉంటుంది.) ఉదయం 6 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. చిలకలపూడి,పెడన స్టేషన్‌లలో కూడా ఆగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement