బైక్‌పై నుంచి పడిపోయిన తెలంగాణ స్పీకర్‌

Speaker Madhusudanachari fall down in bike rally - Sakshi

శాయంపేట: బైక్‌ అదుపుతప్పి స్పీకర్‌ మధుసూదనాచారి కిందపడి పోయారు. ఈ ఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట మండల కేంద్రం శివారులో మంగళవారం జరిగింది. ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. పల్లె ప్రగతి నిద్ర కార్యక్రమంలో భాగంగా స్పీకర్‌ సోమవారం రాత్రి శాయంపేట మండల కేంద్రంలో నిద్రించారు.

మంగళవారం ఆరెపల్లి గ్రామానికి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. తిరుగు ప్రయాణంలో శాయంపేట శివారుకు చేరుకోగానే మూలమలుపు వద్ద ఎదురుగా ఎడ్లబండి రావడంతో బైక్‌ను రోడ్డు కిందికి దించారు. మళ్లీ రోడ్డెక్కే క్రమంలో టైర్‌ స్కిడ్‌ అయి అదుపుతప్పి బైక్‌ పై నుంచి కిందపడిపోయారు. సెక్యూరిటీ సిబ్బంది స్పీకర్‌ను పైకి లేపారు. మళ్లీ యథావిధిగా స్పీకర్‌ బైక్‌పై ర్యాలీ కొనసాగించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top