రైల్వేకోర్టుకు హాజరైన స్పీకర్‌ మధుసూదనాచారి

Speaker Madhusudanachari attended the Railway Court - Sakshi

కాజీపేట రూరల్‌: కాజీపేట రైల్వేకోర్టుకు రైల్‌రోకో కేసులో భాగంగా మంగళవారం స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి, టీఆర్‌ఎస్‌ నాయకులు హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2013 సంవత్సరంలో చేపట్టిన రైల్‌రోకో కేసులో స్పీకర్‌ మధుసూదనచారి, అచ్చ విద్యాసాగర్, ఎస్‌.శ్రీనివాస్, డి.దయాసాగర్, ఎ.వినోద్, దిడ్డి నరేష్, వి.సత్యనారాయణ, బొల్లం సంపత్, మేకల రవి, రామగళ్ల పరమేశ్వర్‌ హాజరయ్యారు.

అదేవిధంగా ధర్మారం రైల్వే గేట్‌ వద్ద 2014 సంవత్సరంలో జరిగిన రైల్‌రోకో కేసులో స్పీకర్‌ మధుసూదనచారి, ల్యాదెళ్ల బాలు, విజయ్, ఎల్‌.రామారావు, పి.ప్రేమ్‌కుమార్, జి.రమేష్, జి.రాజు, కె.రాములు, వి.లింగారెడ్డి, జి.సందీప్‌లు హాజరుకాగా వరంగల్, ధర్మారం కేçసులను పరిశీలించిన రైల్వే మెజీస్ట్రేట్‌ ఈ నెల 19వ తేదీకి వాయిదా వేస్తూ తీర్పు చెప్పినట్లు వారు తెలిపారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top