టికెట్‌.. టికెట్‌..

solipeta ramachandra reddy chitchat with journalists - Sakshi

అసెంబ్లీ లాబీలో చేతిలో సినిమా టికెట్లతో ఎమ్మెల్యే సోలిపేట

సాక్షి, హైదరాబాద్‌: తమ ప్రాంతంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి నిధులను సమకూర్చి, కళాశాల అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి దుబ్బాకలో బెనిఫిట్‌ సినిమా షో వేయిస్తున్నారు. బుధవారం ఆయన సిని మా టికెట్లు పట్టుకొని అసెంబ్లీ లాబీలో కనిపించారు. చేతిలో టికెట్లను చూసిన విలేకరులు ఆయన చుట్టూ చేరి ‘టికెట్లు ఎంతకు ఇస్తున్నారన్న,’ ‘ఎమ్మెల్యేలను అమ్ముతున్నారా’ అంటూ ఆయనతో కొద్దిసేపు చిట్‌చాట్‌ చేశారు. టికెట్‌ ధర రూ.5 వేలని, తమ ప్రాంతానికి చెందిన ప్రజలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులకు మాత్రమే అమ్ముతామని ఎమ్మెల్యే వివరించారు. కొంత మంది జర్నలిస్టు మిత్రులకు ఇచ్చేందుకు ఆ టికెట్లు తెచ్చానని పేర్కొన్నారు. బెనిఫిట్‌ షో ద్వారా రూ.15 లక్షలు కూడబెట్టి జిల్లా కలెక్టర్‌కు అప్పగిస్తామని, ఆ నిధులను కళాశాల అభివృద్ధికి ఖర్చు చేస్తారని చెప్పారు. పేద విద్యార్థులకు ఆర్థిక తోడ్పాటు అందిస్తామని చెప్పారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top