కొత్త ఇళ్లకు 'సోలార్' తప్పనిసరి: కేటీఆర్ | Sakshi
Sakshi News home page

కొత్త ఇళ్లకు 'సోలార్' తప్పనిసరి: కేటీఆర్

Published Fri, Sep 19 2014 4:13 PM

కొత్త ఇళ్లకు 'సోలార్' తప్పనిసరి: కేటీఆర్ - Sakshi

హైదరాబాద్: విద్యుత్ కొరతను అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లో కొత్తగా నిర్మించే ఇళ్లకు సోలార్ ప్యానల్స్ తప్పని చేయాలని భావిస్తోంది. మెరుగైన, నాణ్యమైన విద్యుత్ కోసం సోలార్ ప్యానల్స్ వాడకాన్ని ప్రోత్సహించనున్నట్టు తెలంగాణ పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) తెలిపారు. అడ్మినిస్ట్రేటివ్ కాలేజీ నిర్వహించిన వర్క్షాపులో ఆయన పాల్గొన్నారు.

హైదరాబాద్ లో కొత్తగా నిర్మించే ఇళ్లకు సోలార్ ప్యానల్స్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకునేలా చూడాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించినట్టు కేటీఆర్ తెలిపారు. నగరాల్లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించినంత మాత్రానా స్మార్ట్ సిటీలు అయిపోవని అన్నారు. పౌరులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందితేనే స్మార్ట్ సిటీలు అవుతాయని అభిప్రాయపడ్డారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement