దొరికిన సీతారాముల పంచలోహా విగ్రహాలు | sita rama idols found | Sakshi
Sakshi News home page

దొరికిన సీతారాముల పంచలోహా విగ్రహాలు

Feb 23 2015 11:35 PM | Updated on Sep 2 2017 9:47 PM

పోలీసులు వేమువవాడ మండలం దయ్యవరం గ్రామ సమీపంలోని కల్వర్టు కింద ఉన్న సంచిలో సీతారాముల పంచలోహా విగ్రహలను స్వాధీనం చేసుకున్నారు.

వేములవాడ(కరీంనగర్): పోలీసులు వేమువవాడ మండలం దయ్యవరం గ్రామ సమీపంలోని కల్వర్టు కింద ఉన్న సంచిలో సీతారాముల పంచలోహా విగ్రహలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం గ్రామస్తులు అందించిన సమాచారం ప్రకారం దయ్యవరం చేరుకున్న పోలీసులు సీతారాముల పంచలోహా విగ్రహలు సంచిలో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం పోలీసులు వేమువవాడ రాజన్న దేవాలయ అధికారులకు సమాచారం అందించారు.

 

కాగా, ఈ విగ్రహాలు కొనరావు పేట మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన సీతారామచంద్రాలయంకు చెందినవిగా పోలీసులు భావిస్తున్నారు. ఈ నెల 8న మామిడిపల్లి గ్రామ రామాలయంలోని సీతారాముల విగ్రహాలను గుర్తుతెలియని దుండగులు దోచుకెళ్లిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement