ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్లు

Singareni CMD Sridhar Speaks About Floating Solar power Plants - Sakshi

సింగరేణి సీఎండీ శ్రీధర్‌ వెల్లడి

ప్రభుత్వ అనుమతి వచ్చాక ప్రారంభం

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భారీ నీటి జలాశయాలపై తేలియాడే (ఫ్లోటింగ్‌) సో లార్‌ పవర్‌ ప్లాంట్‌ల నిర్మాణం చేట్టాలని యోచిస్తున్నామని సింగరేణి సంస్థ చైర్మ న్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌.శ్రీధర్‌ తెలిపారు. సింగరేణి ప్రాంతాల్లోనే కాక రాష్ట్రంలోని ఇతర భారీ జలాశయాల్లో కనీసం 500 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలా ర్‌ పవర్‌ ప్లాంట్‌ల నిర్మాణానికి రాష్ట్ర రెన్యువబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ (టీఎ స్‌ఆర్‌ఈడీ) శాఖ సహాయంతో అధ్యయనం చేసినట్లు చెప్పారు. ఇందుకు సం బంధించిన నివేదికను టీఎస్‌ఆర్‌ఈడీ అధికారులు సోమవారం హైదరాబాద్‌ సింగరేణి భవన్‌లో శ్రీధర్‌కు పవర్‌ పాయింట్‌ ప్రజెం టేషన్‌ ద్వారా వివరించారు. ఈ ప్లాంట్‌ నిర్మాణంతో ఎవరికీ ఇబ్బంది కలగకుండా చూడాలని, నిబంధనలకు లోబడి నిర్మిం చేలా ప్రతిపాదలను సమర్పించాలని టీఎస్‌ఆర్‌ఈడీ అధికారులను సీఎండీ కోరారు. బయటి ప్రాంతాల్లో వీటి నిర్మాణం కో సం యోచిస్తున్నామని, ప్రతిపాదనలు పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి సమర్పించి, విద్యుత్‌ కొనుగోలు అనుమతు లు పొందిన తర్వాతనే నిర్మాణం ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top