ఏకధాటిగా 8 గంటలు ‘కోత’ | Shift of 8 hours 'cut' | Sakshi
Sakshi News home page

ఏకధాటిగా 8 గంటలు ‘కోత’

Jun 28 2014 1:10 AM | Updated on Sep 18 2018 8:28 PM

ఏకధాటిగా 8 గంటలు ‘కోత’ - Sakshi

ఏకధాటిగా 8 గంటలు ‘కోత’

గ్రేటర్‌లో ఎడాపెడా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. సరఫరాకు, డిమాండ్‌కు మధ్య భారీ వ్యత్యాసం నమోదవుతుండటంతో కోతలు విధించక తప్పట్లేదని అధికారులు చెబుతున్నారు.

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో ఎడాపెడా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. సరఫరాకు, డిమాండ్‌కు మధ్య భారీ వ్యత్యాసం నమోదవుతుండటంతో కోతలు విధించక తప్పట్లేదని అధికారులు చెబుతున్నారు. అయితే, ముందస్తు సమాచారం లేకుండా పగలు, రాత్రి తేడా లేకుండా ఇష్టానుసారం సరఫరా నిలిపివేస్తుండటంతో నగరవాసులు బెంబేలెత్తుతున్నారు.

సైదాబాద్, కర్మన్‌ఘాట్, భూపేష్‌గుప్తానగర్, ఉప్పల్, నాగోల్, వనస్థలిపురం, రాజేంద్రనగర్, కాటేదాన్ తదితర శివారు ప్రాంతాల్లో శుక్రవారం వరుసగా 8 గంటల పాటు సరఫరా నిలిపేశారు. ఉక్కపోతకు విద్యుత్ కోతలు తోడవటంతో పరిస్థితి దారుణంగా మారుతోంది. మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

ఈ సేవా కేంద్రాల్లో విద్యుత్, మంచినీటి, ఆస్తిపనులు చెల్లింపులు, కుల, ఆదాయ, నివాస, జనన, మరణ, తదితర సర్టిఫికెట్ల జారీకి అవాంతరం కలిగింది. భూముల రిజిస్ట్రేషన్లు, బ్యాంకుల్లో ఆర్థికలావాదేవీలు స్తంభించిపోయాయి. కోతల వల్ల డీజిల్, పెట్రోల్ అమ్మకాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement