మేకల కాపరి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్‌లో బుధవారం చోటుచేసుకుంది.
మేకల కాపరి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్‌లో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. తానూరు మండలం బింబార్ గ్రామానికి చెందిన గజానంద్ (40)కు ఆరు మేకలు ఉన్నాయి. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు మేకలన్నీ మృతి చెందడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆయన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.