షర్మిల పరామర్శయాత్ర తాత్కాలిక వాయిదా | Sharmila paramarsha yatra temporary reprieve | Sakshi
Sakshi News home page

షర్మిల పరామర్శయాత్ర తాత్కాలిక వాయిదా

Feb 14 2015 1:41 AM | Updated on Aug 9 2018 4:45 PM

షర్మిల పరామర్శయాత్ర తాత్కాలిక వాయిదా - Sakshi

షర్మిల పరామర్శయాత్ర తాత్కాలిక వాయిదా

ఈనెల 18 నుంచి 22వ తేదీ వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల జిల్లాలో తలపెట్టిన...

ఎన్నికల కోడ్ అడ్డంకితో నిర్ణయంలో మార్పు  కోడ్ ముగిసిన తర్వాత జరిగే అవకాశం
 
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఈనెల 18 నుంచి 22వ తేదీ వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల జిల్లాలో తలపెట్టిన మలివిడత పరామర్శయాత్ర తాత్కాలికంగా వాయిదా పడింది. జిల్లాలో శాసనమండలి ఎన్నికలకు షెడ్యూల్ విడుదలై కోడ్ అమల్లోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ెహైదరాబాద్‌లో వెల్లడించారు.ఎన్నికల కోడ్ అడ్డంకి కావడంతో జిల్లాలో పరామర్శయాత్ర తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.అయితే, షర్మిల యాత్ర జిల్లాలో మళ్లీ జరుగుతుందని, తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాల వద్దకు షర్మిల వస్తారని పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. తాత్కాలికంగానే యాత్ర వాయిదా పడిందని, కోడ్ ముగిసిన తర్వాత జిల్లాలో మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో షర్మిల పర్యటించి ఆయా కుటుంబాలను పరామర్శిస్తారని ఆయన వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement