రుణాలు లేనట్టే..!

Second Should Rythu Bandhu Cheques Distribution Adilabad - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌టౌన్‌: రైతుబంధు పథకం రెండో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంపై అయోమయం నెలకొంది. శనివారం నుంచి జిల్లాలో ప్రారంభం కావాల్సిన చెక్కుల పంపిణీపై సందిగ్ధత ఏర్పడింది. అధికారులు చెక్కులు పంపిణీ చేయాలా లేదా అనే అయోమయంలో ఉన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ ఎన్నికల సంఘం నిబంధనలు విధించడంతో పంపిణీ కార్యక్రమం ముందుకు సాగుతుందోలేదోనని సందేహం వ్యక్తం అవుతోంది. రైతులు శనివారం నుంచి చెక్కులు పంపిణీ చేస్తారనే సంతోషంలో ఉన్నప్పటికీ శుక్రవారం ఎన్నికల సంఘం పలు నిబంధనలు విధించింది. జాబితాలో కొత్త రైతుల పేర్లు చేర్చవద్దని, ప్రచారం ఆర్భాటాలు, బహిరంగ సభలు నిర్వహించి చెక్కులను పంపిణీ  వివిధ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకం కింద సబ్సిడీపై రుణాలు అందజేస్తోంది.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటీడీఏ నుంచి స్వయం ఉపాధి రుణాల కోసం ఎలాంటి ప్రకటన విడుదల కాకపోవడంతో గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడంతో ఈ ఏడాది రుణాలు రావడం కష్టమేనని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం అంతంత మాత్రంగానే నోటిఫికేషన్‌ను విడుదల చేయడంతో కనీసం స్వయం ఉపాధి రుణాలను పొంది కుటుంబాన్ని పోషించుకుందామని ఆశలు పెట్టుకున్న గిరిజన నిరుద్యోగులకు ఈ ఏడాది నిరాశనే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

2017–18లో 300 మందికే..
2017–18 ఆర్థిక సంవత్సరంలో వివిధ కేటగిరీల్లో 1,274 మంది నిరుద్యోగులు వివిధ స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారికి రుణాలు మంజూరు కాగా వీరికి రూ.13.75 కోట్లు అవసరమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో కేటగిరి 1లో 506 మంది లబ్ధిదారులు, కేటగిరిలో 2లో 621 మంది దరఖాస్తు చేసుకున్నారు. కేటగిరి 3లో 147 మంది లబ్ధిదారులకు రుణాలు మంజూరైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు కేవలం 300 మందికి రూ.3కోట్ల వరకు సబ్సిడీని వారి ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. మిగతా 974 మంది లబ్ధిదారులు సబ్సిడీ కోసం ఎదురు చూస్తున్నారు.

2018–19లో నిరాశే..? 
2018–19 ఆర్థిక సంవత్సరంలో స్వయం ఉపాధి పథకం కింద రుణాలను అందించేందుకు వార్షిక ప్రణాళికను తయారు చేసి కమిషనరేట్‌కు పంపించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1915 మంది లబ్ధిదారులకు రూ.18.44 కోట్లు అందించేందుకు ప్రణాళికను రూపొందించారు. కానీ ఇటీవల ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో కొత్త వారికి ఈ ఆర్థిక సంవత్సరంలో రుణాలు మంజూరు కావడం కష్టమేనని పలువురు గిరిజనులు పేర్కొంటున్నారు. అధికారులు సంబంధిత వార్షిక ప్రణాళికలను ముందస్తుగా ప్రభుత్వానికి పంపించి ఉంటే కోడ్‌ అమలు కంటే ముందుగానే గిరిజన నిరుద్యోగులు రుణాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కలిగేదని పలువురు నిరుద్యోగులు పేర్కొంటున్నారు.

తప్పని నిరీక్షణ..
2018–19 ఆర్థిక సంవత్సరంలో ఐటీడీఏలో స్వయం ఉపాధి రుణాల కోసం గిరిజన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునేందుకు సర్టిఫికేట్లను సిద్ధంగా చేసుకున్న వారికి నిరీక్షణ తప్పడం లేదు. తీర ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో నిరాశ చెందుతున్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రుణం మంజూరైన వారికి సబ్సిడీ ఖాతాల్లో జమ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సకాలంలో సబ్సిడీ రుణాలను జమా అయ్యేలా చూడాలని కోరుతున్నారు.

దరఖాస్తులు స్వీకరిచాలి
ఎస్సీ కార్పొరేషన్‌లో ప్రభుత్వం స్వయం ఉపాధి రుణాలను అందించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఐటీడీఏలో స్వయం ఉపాధి రుణాలను అందించేందుకు కనీసం దరఖాస్తుల స్వీకరణ కోసం కనీసం నోటిఫికేషన్‌ కూడా జారీ కాలేదు. దీంతో జిల్లాలోని గిరిజన నిరుద్యోగులు నష్టపోయే అవకాశం ఉంది.  – కుమ్ర రాజు, కుంమ్రంసూరు యువసేన జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆదిలాబాద్‌ 

రుణాల కోసం ఎదురుచూపు
ఉమ్మడి జిల్లాలో ఉద్యోగాలు రాక చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం స్వయం ఉపాధి పథకం కింద రుణాలకు దరఖాస్తు చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందుదామంటే 2018–19 ఆర్థిక సంవత్సరంలో స్వయం ఉపాధి రుణాల కోసం ఇంకా ఎలాంటి నోటిఫికేషన్‌ రాలేదు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో వివిధ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇంకా సబ్సిడీ జమ కాలేదు. అధికారులు స్పందించి సకాలంలో సబ్సిడీ నగదు జమ అయ్యేలా చూడాలి.  – ఆత్రం వెంకటేశ్, ఆదివాసీ యువజన సంఘం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడు  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top