ఐఐటీల్లో మిగిలిపోతున్న సీట్లు | Seats left in IITs | Sakshi
Sakshi News home page

ఐఐటీల్లో మిగిలిపోతున్న సీట్లు

Jul 29 2017 2:30 AM | Updated on Sep 5 2017 5:05 PM

ఐఐటీల్లో మిగిలిపోతున్న సీట్లు

ఐఐటీల్లో మిగిలిపోతున్న సీట్లు

ప్రతిష్టాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీల్లో (ఐఐటీ) మిగిలిపోతున్న సీట్ల సంఖ్య ఏటేటా పెరుగు తోంది.

ఈసారి మిగిలిన 121 సీట్లు
సీట్లు పెంచడం వల్లే అంటున్న ఐఐటీ వర్గాలు


సాక్షి, హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీల్లో (ఐఐటీ) మిగిలిపోతున్న సీట్ల సంఖ్య ఏటేటా పెరుగు తోంది. 5 దశల ప్రవేశాల కౌన్సెలింగ్‌ నిర్వహించాక గతేడాది 96 సీట్లు మిగిలి పోగా, ఈసారి 7 దశల కౌన్సెలింగ్‌ నిర్వహిం చినా 121 సీట్లు మిగిలిపోయాయి. 23 ఐఐటీల్లోని 10,962 సీట్ల భర్తీకి, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీ, కేంద్రం ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యా సంస్థల్లోని (జీఎఫ్‌టీఐ) 19 వేల సీట్ల భర్తీకి జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) ఈనెల 22 వరకు 7 దశల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ను నిర్వ హించింది.

ఈసారి ఐఐటీల్లో 121 సీట్లు మిగిలిపోగా, ఎన్‌ఐటీల్లో 461 సీట్లు సహా ట్రిపుల్‌ ఐటీ, జీఎఫ్‌టీఐల్లో మొత్తం 6,510 సీట్లు మిగిలిపోయా యి. వాటి భర్తీకి స్పెషల్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహ ణకు సెంట్రల్‌ సీట్‌ అలకే షన్‌ బోర్డు (సీఎస్‌ఏబీ) చర్యలు చేపట్టింది. విద్యార్థులు నేడు ఫీజు చెల్లించి, రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని జోసా పేర్కొంది. ఈనెల 30న మధ్యాహ్నం 2 గంటలకు సీట్లు కేటాయించ నుంది.

ఐఐటీల్లో ఇక అంతే..
ఐఐటీల్లో మిగిలిన సీట్ల భర్తీకి మరో కౌన్సెలింగ్‌ నిర్వహించట్లేదు. దీంతో 121 సీట్లు ఈ ఏడాది ఖాళీగానే ఉండనున్నాయి. అత్యధికంగా బనారస్‌ హిందూ యూనివర్సి టీలో 32 సీట్లు మిగిలిపోయాయి. ఐఐటీ దన్‌బాద్‌లో (ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ మైన్స్‌) 23, ఐఐటీ–జమ్మూలో 12, ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 9 సీట్లు మిగిలిపోయాయి. ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాసు, ఐఐటీ రోపర్, ఐఐటీ పాలక్కడ్, ఐఐటీ గోవాలో ఒక్కోటి చొప్పున సీట్లు మిగిలాయి. హైదరాబాద్, కాన్‌పూర్, జోధ్‌పూర్‌ ఐఐటీల్లో మాత్రం 100% సీట్లు భర్తీ అయ్యాయి. ఐఐటీల్లో సీట్ల సంఖ్య పెంచడం వల్లే సీట్లు మిగిలాయని, లేదంటే అన్నీ భర్తీ అయ్యేవని ఐఐటీ వర్గాలు పేర్కొన్నాయి.

ఐఐటీల్లో మిగిలిపోతున్న సీట్లు..
సంవత్సరం    మిగిలిపోయినవి
2014–15    3
2015–16    50
2016–17    96
2017–18    121

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement