'అటవీ అభివృద్ధికి మీవంతు సహకారం అందించాలి' | Santhosh Kumar Says, You Must Contribute For Development Of Forest By Gift -A-Smile Challenge | Sakshi
Sakshi News home page

'అటవీ అభివృద్ధికి మీవంతు సహకారం అందించాలి'

Jul 23 2019 4:08 PM | Updated on Jul 23 2019 4:23 PM

Santhosh Kumar Says, You Must Contribute For Development Of Forest By Gift -A-Smile Challenge - Sakshi

సాక్షి, కీసరగుట్ట(మేడ్చల్) : తెలంగాణకు హరితహారంలో భాగంగా రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్ మరో వినూత్న కార్యక్రమానికి తెరలేపారు‌. కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా 'గిఫ్ట్‌ ఏ స్మైల్‌' చాలెంజ్‌లో భాగంగా కీసరగుట్టలోని రిజర్వ్‌ ఫారెస్ట్‌ అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగా 2,042 ఎకరాల అటవీ ప్రాంతంలో తన వంతుగా ఎకో టూరిజం పార్కు, అటవీ పునరుజ్జీవన  అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా అటవీ ప్రాంతాల అభివృద్ధికి తమవంతు సహకారాన్ని అందించాలని కోరుతూ సంతోష్‌ కుమార్‌ పలువురు ప్రముఖులను 'గిఫ్ట్‌ ఏ స్మైల్‌'కు హ్యాష్‌ ట్యాగ్‌ చేశారు. ట్యాగ్‌ చేసిన వారిలో మాజీ ఎంపీ కవిత, సినీ హీరోలు విజయ్‌దేవరకొండ, నితిన్‌, దర్శకుడు వంశీ పైడిపల్లి, పారిశ్రామిక వేత్త ముత్తా గౌతమ్‌లు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement