నేటినుంచి సంగమేశ్వర స్వామి జాతర | sangameshwar swami jatara from today | Sakshi
Sakshi News home page

నేటినుంచి సంగమేశ్వర స్వామి జాతర

Mar 16 2014 3:25 AM | Updated on Sep 2 2017 4:45 AM

నేటినుంచి సంగమేశ్వర స్వామి జాతర

నేటినుంచి సంగమేశ్వర స్వామి జాతర

మండలంలోని కొట్టాల గ్రామంలో కొలువుదీరిన శ్రీ సంగమేశ్వర స్వామి జాతర ఆదివారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఆ గ్రామ సర్పంచ్ బెంది లత రమేష్‌గౌడ్ తెలిపారు.

 కౌడిపల్లి, న్యూస్‌లైన్: మండలంలోని కొట్టాల గ్రామంలో కొలువుదీరిన శ్రీ సంగమేశ్వర స్వామి జాతర ఆదివారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఆ గ్రామ సర్పంచ్ బెంది లత రమేష్‌గౌడ్ తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు మూడు రోజల పాటు ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. 16న బండ్ల ఊరేగింపు, 17న అగ్ని గుండాలు తొక్కుట,  పాచి బండ్ల ప్రదర్శన, ఒగ్గుకథ, 18వ తేదీ రాత్రి రథోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement