అన్ని గురుకులాల్లో ఒకే మెనూ

Same manu to all the Gurukulas - Sakshi

మంచి భోజనం, మౌలిక వసతులు కల్పించాలి

అధికారులకు డిప్యూటీ సీఎం కడియం ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని గురుకులాల్లో ఒకే రకమైన భోజనం (మెనూ), మౌలిక వసతులు (అమెనిటీస్‌) కల్పించాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశించారు. ఇందుకు అవసరమయ్యే నిధుల కోసం వచ్చే బడ్జెట్‌లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో రకరకాల పద్ధతులుండటం వల్ల పిల్లల్లో బేధభావాలేర్పడే అవకాశం ఉందని.. అందరికీ సమానావకాశాలు, సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్, మోడల్‌ స్కూళ్లు, కేజీబీవీలు, ఆశ్రమ పాఠశాలల అధికారులతో కడియం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులకు మంచి మెనూ అందిస్తున్నారని, వస తులూ బాగున్నాయని.. ఇలాంటి మెనూ, వసతులు అన్ని సొసైటీల్లోని విద్యార్థులకు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. 

వసతుల కల్పన మన బాధ్యత
మోడల్‌ స్కూళ్లలో హాస్టళ్లు, అకడమిక్‌ బ్లాకులున్నాయని.. కేజీబీవీలలో వచ్చే ఏడాది నుంచి అకడమిక్‌ బ్లాకులు నిర్మిం చాలని యోచిస్తున్నట్లు కడియం తెలిపారు. రెండేళ్లలో కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లలో బయోమెట్రిక్‌ మెషీన్లు, సీసీ కెమెరాలు, ఆర్వో ప్లాంట్లు, డ్యుయల్‌ డెస్క్‌లు, డిజిటల్‌ క్లాసులు, కంప్యూటర్లు, ప్రాక్టికల్‌ ల్యాబ్‌లు, ఫర్నిచర్‌ ఇచ్చామన్నారు. చలికాలంలో వేడి నీళ్లు అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మోడల్‌ స్కూళ్లు, కేజీబీవీల్లో ఉంటున్న వారికి ప్రభుత్వం నుంచి అన్ని వసతులు అందించడం కనీస బాధ్యతని చెప్పారు.

ఆన్‌కాల్‌లో డాక్టర్లు: ప్రవీణ్‌ కుమార్‌
విద్యార్థుల హజరు నమోదులో అవకతవకల్లేకుండా ఆన్‌లైన్‌లో హాజరు నమోదు చేస్తున్నామని, తర్వాత మార్చడానికి వీల్లేకుండా ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఉత్తమ విధా నం అవలంభిస్తున్నామని సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శి ప్రవీణ్‌ కుమార్‌ చెప్పారు. కమాండ్‌ కంట్రోల్‌ హెల్త్‌ సెంటర్‌ ఏర్పాటుచేశామని, ప్రతి విద్యార్థికి ఎలక్ట్రా నిక్‌ హెల్త్‌ కార్డులు జారీ చేశామని, కమాండ్‌ సెంటర్‌లో ఆన్‌కాల్‌లో డాక్టర్లను అందుబాటులో ఉంచుతున్నామ న్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థి కోలుకునే వరకు నిరంతర పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top