దళితుల పట్ల కేసీఆర్ శుష్ట వాగ్దానాలు, శూన్య హస్తాలు ఇచ్చారని తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యదర్శి సాంబమూర్తి ధ్వజమెత్తారు.
హైదరాబాద్: దళితుల పట్ల కేసీఆర్ శుష్క వాగ్దానాలు, శూన్య హస్తాలు ఇచ్చారని తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యదర్శి సాంబమూర్తి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా సాంబమూర్తి మాట్లాడుతూ.. ప్రచార ఆర్బాటంతో భూపంపిణీని ఆశల పల్లకిలో ఊరేగిస్తున్నారని ఎద్దెవా చేశారు. డిసెంబర్ 6న అంబేద్కర్ వర్థంతి సందర్భంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో సభలు సమావేశాలు ఏర్పాటుచేయనున్నట్టు సాంబమూర్తి పేర్కొన్నారు.