
ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్న అధికారులు
మహబూబ్‌నగర్ రూరల్: జిల్లాలోని ఒంటరి మహిళలకు సఖి కార్యక్రమం అండగా నిలుస్తుందని మహిళా, శిశు సంక్షేమశాఖ జిల్లా అధికారి జి.శంకరాచారి అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ పట్టణంలోని రైల్వేస్టేషన్ ప్రాంతంలో ఆటో డ్రైవర్లకు ‘సఖి’ సేవల గురించి అవగాహన కల్పించారు. ఆడపిల్లలను, యువతులను ఆకతాయిలు, పోకిరీల నుంచి కాపాడడం కోసం సఖీ కేంద్రం పని చేస్తుందని తెలిపారు.
ఎవరు వేధింపులకు పాల్పడినా 181కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చని చెప్పారు. కార్యక్రమంలో సఖీ కేంద్రం అధికారి మంజుల, ప్రశాంతి, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు వి.రాములుయాదవ్, ఆటోడ్రైవర్లు గోపాల్, ఎండీ మహబూబ్ అలీ, మహేష్‌కుమార్, ఎండీ ఫజిల్, ఎండీ రుక్నోద్దీన్, యాదగిరి, వెంకట్రాములు పాల్గొన్నారు.