
రద్దీ ఉన్నా ‘ఆసరా’ ఇవ్వాల్సిందే
రాష్ట్రవ్యాప్తంగా ఆసరా పింఛన్ల పంపిణీని గురువారం ప్రారంభించాలని గ్రామీణాబివృద్ధి శాఖ నిర్ణరుుంచింది.
• రేపటి నుంచి ‘ఆసరా’ పింఛన్ల పంపిణీ
• రద్దీ ఉన్నా చేయక తప్పదన్న గ్రామీణాభివృద్ధి కమిషనర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆసరా పింఛన్ల పంపిణీని గురువారం ప్రారంభించాలని గ్రామీణాబివృద్ధి శాఖ నిర్ణరుుంచింది. పెద్దనోట్ల రద్దుతో కొత్తనోట్ల కోసం విపరీతమైన రద్దీ నెలకొన్నందున ప్రస్తుతానికి పింఛన్ల పంపిణీని వారుుదా వేయాలని బ్యాంకులు, పోస్టల్ అధికారులు చేసిన ప్రతిపాదనను కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్ తోసిపుచ్చారు. ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమైనందున తప్పనిసరిగా లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ల పంపిణీ జరగాల్సిందేనని బుధవారం జరిగిన సమావేశంలో ఆమె స్పష్టం చేశారు. అవసరమతే పంపిణీ చేసేందుకు గడువును పొడిగిస్తామని కమిషనర్ హామీ ఇవ్వడంతో పింఛన్ల పంపిణీకి బ్యాంక్, పోస్టల్ అధికారులు అంగీకారం తెలిపారు.
50 శాతం లబ్ధిదారుల ఖాతాలకు నేడే జమ
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 36 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ నిమిత్తం ప్రభుత్వం ఇప్పటికే రూ.395 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. లబ్ధిదారుల్లో 50 శాతం మంది బ్యాంకు ఖాతాలకు పింఛన్ సొమ్ము బుధవారమే జమ చేయనున్నట్లు సెర్ప్ అధికారులు తెలిపారు. అలాగే 37 శాతం మంది లబ్ధిదారులకు పోస్టాఫీసుల ఖాతాలు ఉన్నందున, లబ్ధిదారులు తమ ఆసరా పింఛన్ సొమ్మును గురువారం నుంచి తీసుకోవచ్చని సూచిస్తున్నారు. ఇక మాన్యువల్‌గా పింఛన్ సొమ్మును స్వీకరించే లబ్ధిదారుల కోసం సుమారు రూ.40 కోట్లను ఆయా మండల పరిషత్ అభివృద్ధి అధికారుల ఖాతాలకు జమ చేయనున్నారు.
ఉపాధిహామీ పనులకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన సొమ్మును కూడా వెంటనే కూలీలకు అందేలా చర్యలు చేపట్టాలని పోస్టల్ అధికారులను కమిషనర్ కోరారు. వచ్చే నెల నుంచి బ్యాంకులకు ఎన్‌పీసీఐ విధానం ద్వారా ఆసరా సొమ్మును అందజేస్తామని, దీని ద్వారా మూడురోజుల్లోనే లబ్ధిదారుల ఖాతాలకు పింఛన్ సొమ్మును జమ చేసేందుకు వీలవుతుందన్నారు. మాన్యువల్‌గా ఆసరా సొమ్మును పొందుతున్న లబ్ధిదారులకు బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో ఖాతాలు తెరవాలని సెర్ప్ అధికారులను ఆదేశించారు. ఆసరా పింఛన్లు, ఉపాధిహామీ వేతనాల చెల్లింపుల నిమిత్తం బిజినెస్ కరస్పాండెంట్లను ఎంపిక చేసి, బ్యాంకులతో అగ్రిమెంట్ చేసుకోవాలని సెర్ప్ అధికారులకు కమిషనర్ సూచించారు. సమావేశంలో గ్రామీణాభివృద్ధి విభాగం జారుుంట్ కమిషనర్ సైదులు, నగదు అధికారి మూర్తి, సెర్ప్ డెరైక్టర్ రాజేశ్వర్‌రెడ్డి, పోస్టల్, వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.