
'తెలంగాణకు రూ.1300 కోట్లు కేటాయింపు'
ఈ ఏడాది తెలంగాణా రాష్ట్రానికి పెట్రోలియం శాఖ నుంచి రూ. 1300 కోట్లు కేటాయిస్తామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు.
హైదరాబాద్:ఈ ఏడాది తెలంగాణా రాష్ట్రానికి పెట్రోలియం శాఖ నుంచి రూ. 1300 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. దీనిలో భాగంగానే తెలంగాణకు గ్యాస్ పైప్ లైన్లు, ఎల్పీజీ, సీఎన్జీ కనెక్టివిటీలను ఏర్పాటు చేయడానికి వంద శాతం ప్రయత్నిస్తున్నామన్నారు.
హైదరాబాద్ కోసం ఈస్ట్, వెస్ట్ నుంచి ప్రత్యేక గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారానికి గ్యాస్ ను కేటాయిస్తున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.