జర్నలిస్టులకు రూ.5లక్షల ప్రమాద బీమా | Rs 5 lakh accidental insurance for Journalists | Sakshi
Sakshi News home page

జర్నలిస్టులకు రూ.5లక్షల ప్రమాద బీమా

Dec 4 2014 11:14 PM | Updated on Apr 3 2019 8:03 PM

జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ. 5 లక్షల ప్రమాద బీమా కల్పించేందుకు ప్రెస్ అకాడమీ నిర్ణయించిందని..

సంగారెడ్డి మున్సిపాలిటీ: జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ. 5 లక్షల ప్రమాద బీమా కల్పించేందుకు ప్రెస్ అకాడమీ నిర్ణయించిందని, ఈ నెల 10లోగా  జర్నలిస్టులు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ జర్నలిస్టు యూనియన్ (టీయూడబ్ల్యూజే) జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో  జర్నలిస్టులందరికీ ఉచిత ప్రమాద బీమా కల్పించాలని ప్రెస్ అకాడమీ చెర్మైన్, యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ నిర్ణయం తీసుకున్నారన్నారు.  ప్రమాద బీమా కోసం చెల్లించే ప్రీమియాన్ని  రాష్ట్ర కమిటీ భరిస్తుందన్నారు. జిల్లాలోని జర్నలిస్టులంతా తమ నియోజకవర్గంలోని టీయూడబ్ల్యూజే, టీఈఎంజేయూ బాధ్యులను సంప్రదించి దరఖాస్తు ఫారాలు తీసుకోవాలన్నారు. బీమా కోసం ఈ నెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలని విష్ణువర్ధన్‌రెడ్డి కోరారు.

జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య

మెదక్ మున్సిపాలిటీ: జిల్లాలో పని చేస్తున్న జర్నలిస్టు ల పిల్లలకు అన్ని కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్యను అందచేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు కలెక్టర్ జీఓ విడుదల చేసినట్లు ఐజేయూ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మినుపూర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం స్థానిక టీఎన్‌జీఓ భవన్‌లో జీఓ  కాపీలను వారు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జీఓ విడుదలకు కృషి చేసిన రాష్ట్ర మంత్రి హరీష్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement