కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలో బుధవారం రాత్రి భారీ చోరీ జరిగింది.
మెట్‌పల్లి: కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలో బుధవారం రాత్రి భారీ చోరీ జరిగింది. వివరాలు.. స్థానికంగా పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న అసద్‌అలి రెండు రోజుల కిందట పని నిమిత్తం కుటుంబంతో సహా హైదరాబాద్ వెళ్లారు. ఇది గమనించిన దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న 48 తులాల బంగారు ఆభరణాలతో పాటు, రూ.1.35 లక్షల నగదుతో ఉడాయించారు. ఇది గుర్తించిన స్థానికులు అసద్ అలీ కి సమాచారం ఇచ్చారు. భాదితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు క్లూస్‌టీంతో సహా రంగంలోకి దిగి విచారణ చేపడుతున్నారు.