ఓ ప్రైవేటు పాఠశాల బస్సుకు పెను ప్రమాదం తప్పింది.
హైదరాబాద్ : ఓ ప్రైవేటు పాఠశాల బస్సుకు పెను ప్రమాదం తప్పింది. నగరంలోని దబీర్‌పుర వంతెనపై వెళ్తున్న బస్సు చక్రం ఊడిపోయింది. ఈ సంఘటన నుంచి బస్సులో ఉన్న విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం... సంతోష్ నగర్ గౌతం టాలెంట్ స్కూల్ కు చెందిన బస్సు వివిధ ప్రాంతాల నుంచి 8 మంది విద్యార్థులతో వెళ్తోంది. దబీర్ పుర వంతెన దగ్గరకు రాగానే బస్సు చేరుకోగానే చక్రం ఊడిపోయింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సు ను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులను వేరొక వాహనంలో స్కూల్‌కు పంపించారు.
(మన్సూరాబాద్)